నంద్యాల-కడప డెమో రైలుకు శనివారం పెను ప్రమాదం తప్పింది. ఉదయం 6 గంటలకు రైలు కడపకు బయల్దేరింది. ఈ క్రమంలో కోవెలకుంట్ల, సంజామల మధ్య విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి. దీంతో రైలులోని 350 మందికి పైగా ప్రయాణికులు హడలిపోయారు. వెంటనే రైలు నుంచి దిగి పరుగులు తీశారు. సమస్య చక్కదిద్దిన తర్వాత గంట ఆలస్యంగా రైలు బయల్దేరింది. ప్రాణాపాయం సంభవించకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.