దేశంలో కోవిడ్ ఉధృతి కొనసాగుతోంది. తాజాగా గత 24 గంటల వ్యవధిలో 15,815 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 68 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే 20,018 మంది కోవిడ్ మహమ్మారి నుంచి కోలుకోవడం ఊరటనిస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కోవిడ్ యాక్టివ్ కేసుల సంఖ్య 1,19,264కు చేరింది. డైలీ పాజిటివిటీ రేటు 4.36 శాతంగా నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలు వెల్లడించాయి.