ఇండియన్ ప్రీమియర్ లీగ్ మొదటి సీజన్ విజేతగా నిలిచిన రాజస్తాన్ రాయల్స్ యాజమాన్యం ది రాయల్ గ్రూప్ సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో భాగం కానుంది. పర్ల్ ఫ్రాంఛైజీని కొనుగోలు చేసిన గ్రూప్ శుక్రవారం జట్టు పేరును వెల్లడించింది. ఈ మేరకు ‘‘ది రాయల్ స్పోర్ట్స్ గ్రూప్ తమ కొత్త టీ20 ఫ్రాంఛైజీకి ‘పర్ల్ రాయల్స్’గా నామకరణం చేసింది. వచ్చే ఏడాది సౌతాఫ్రికా టీ20 లో పర్ల్ రాయల్స్ ఆడనుంది’’ అని ప్రకటన చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa