కర్ణాటక రాష్ట్రం మంగళూరులోని ఇన్ఫాంట్ మేరీ స్కూల్ తీసుకున్న నిర్ణయం వివాదాస్పదమైంది. స్కూలులోకి ఆభరణాలను అనుమతించడం లేదని పేర్కొంటూ రాఖీలు తొలగించాలని విద్యార్థులను ఆదేశించింది. కనీసం 20 మంది విద్యార్థుల తల్లిదండ్రులు ఆ నిర్ణయంపై నిరసనలు చేపట్టారు. దీంతో స్కూలు యాజమాన్యం దిగొచ్చి, క్షమాపణలు చెప్పింది. తమ సిబ్బందిలో కొంత మంది చేసిన పొరపాటుగా ఆ ఘటనను అభివర్ణించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa