గతంలో అధిక బరువు, జంక్‌ఫుడ్, తీపి పదార్థాలు తినడం, వ్యాయామం చేయకపోవడంతో మధుమేహం వచ్చేది. కానీ, ఇప్పుడు కాలుష్యం, వాతావరణంలోని మార్పులతో టైప్-2 మధుమేహం వచ్చే ముప్పు పెరుగుతోందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాలుష్య కణాలు క్లోమగ్రంథి పనితీరును ప్రభావితం చేయడంతో షుగర్ వ్యాధి వస్తుందంటున్నారు. పరిశ్రమలు, వాహనాల కాలుష్యంతోపాటు ఇంట్లో వాడే వంట చెరుకు కూడా ఈ వ్యాధి రావడానికి కారణమవుతోందంటున్నారు.