యూపీలో దారుణం చోటు చేసుకుంది. ఇటీవల యూపీలోని కోసికలన్ టౌన్ కు చెందిన ఓ మహిళ వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. విషయం భర్తకు తెలియడంతో నిలదీశాడు. దీంతో ఆమె అతడిని హత్య చేయాలని ప్లాన్ వేసింది. అతడు నిద్రిస్తున్న సమయంలో అతనిపై పెట్రోల్ పోసి నిప్పంటించింది. దీంతో మంటలకు తట్టుకోలేక గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు వచ్చి అతడిని ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు.