వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ నగ్న వీడియో కాల్ వ్యవహారం పై రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు మహిళా జేఏసీ ఫిర్యాదు చేసింది. టీడీపీ తెలుగు మహిళా విభాగం అధ్యక్షురాలు వంగలపూడి అనిత జేఏసీ నేతలతో కలిసి రాజ్ భవన్ కు వెళ్లారు. గవర్నర్ కు రాఖీ కట్టి ఎంపీ మాధవ్ అంశాన్ని ఆయనకు వివరించారు. అటు, అనిత ట్విట్టర్ లో స్పందిస్తూ, వైసీపీ డర్టీ ఎంపీ మాధవ్ వీడియో ఒరిజినల్ అని, ఎడిట్ చేయలేదని అమెరికాలోని ఎక్లిప్స్ ఫోరెన్సిక్ ల్యాబ్ ధ్రువీకరించిందని వెల్లడించారు. అయితే, ఏపీలో అధికారులు వీడియోను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపకుండానే జగన్ రెడ్డికి కావాల్సిన రీతిలో ప్రకటన విడుదల చేశారని అనిత ఆరోపించారు.
వీడియోపై అనుమానాలు ఉంటే కేంద్ర ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో అధికారులు ఒత్తిడికి తలొగ్గుతున్నట్టు కనిపిస్తోందని అభిప్రాయపపడ్డారు. ఈ వ్యవహారాన్ని సీబీఐతో విచారణ జరిపించాలని అనిత డిమాండ్ చేశారు. అమెరికా ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక చూశాక అయినా జగన్ రెడ్డి తన పార్టీ డర్టీ ఎంపీ మాధవ్ ను బహిష్కరించాలని స్పష్టం చేశారు.