ఆంధ్రప్రదేశ్ లో మళ్లీ వైఎస్సార్సీపీదే హవా అని నేషనల్ సర్వేలు నిగ్గుతేల్చాయని రాజ్యసభ సభ్యులు, వైఎస్సార్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. ట్విట్టర్ వేదికగా శనివారం పలు అంశాలు వెల్లడించారు. ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే వెల్లడించిన వివరాల ప్రకారం దేశంలో అత్యంత ప్రజాదరణ కలిగిన ముఖ్యమంత్రుల్లో ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి 5 వ స్థానంలో ఉన్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏపీలో 25 పార్లమెంట్ స్థానాలకు వైఎస్సార్సీపీ 18, తేదేపాకు వస్తాయని సర్వే వెల్లడించింది. రాష్ట్ర ప్రజల నంబర్ వన్ ఛాయిస్ ఎప్పటికీ జగన్మోహన్ రెడ్డి మాత్రమే. సంక్షేమ పానలతో ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్నారని ఆయన తెలిపారు. రానున్న ఎన్నికల్లో వైఎస్సార్సీపీ మరోమారు ప్రభంజనం సృష్టిస్తుందని అన్నారు. వైఎస్సార్సీపీ విజయం నల్లేరు మీద నడకేనని అన్నారు.
రవాణా రంగంలో లో వృద్ధి.
కోవిడ్ మహమ్మారి కారణంగా కుంటుపడిన రాష్ట్ర రవాణా రంగం ఈ ఆర్దిక సంవత్సరం మెదటి త్రైమాసికంలో గణనీయమైన వృద్ధి నమోదు చేసిందని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. 58% వృద్ధి నమోదుతో మెరుగైన ఫలితాలు సాధించిందని అన్నారు.
చంద్రబాబు పాలనలో లోకేష్ ఒక్కడికే ఉద్యోగం.
ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పిన చంద్రబాబు తన ఐదేళ్ల పాలనలో ఆయన కుమారుడు లోకేష్ ఒక్కడినే ఉద్యోగం ఇచ్చాడని ఏద్దేవా చేశారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత రెగ్యులర్, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ విధానంలో మొత్తం 6 లక్షల పైచిలుకు ఉద్యోగాలు భర్తీ చేశారు. 2021-22 జాబ్ క్యాలెండర్ లో 47465 ఉద్యోగాలు గుర్తించి అందులో 83. 5% పోస్టులు భర్తీ చేశారని విజయసాయి రెడ్డి తెలిపారు.