ప్రస్తుతం వర్షాకాలం కావడంతో సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదాలు ఉన్నాయని తగు విధమైన జాగ్రత్తలను పాటించాలని ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ కె. నివాస్ వీడియో కాన్ఫరెన్సులో తెలిపారని పామర్రు పీహెచ్ సీ వైద్యుడు డాక్టర్ ఇ. సురేష్ అన్నారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో మండల స్థాయి వైద్యాధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీజనల్ వ్యాధుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, కోవిడ్ వ్యాక్సినేషన్‌పై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అన్నారు. ప్రభుత్వ వైద్య శాలలోనే ప్రసవాలు జరిగే విధంగా చర్యలు తీసుకు ని, కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించాల న్నారు. సచివాలయాల పరిధిలో వైద్య శిబిరాలను నిర్వహించే విధంగా తగు చర్యలు తీసుకుని ప్రతి గ్రామంలో ఉచిత వైద్య శిబిరాలను నిర్వహిం చాలన్నారు. సీజనల్ వ్యాధులైన డయేరియా, కలరా, డెంగీ తదితర వ్యాధులు ప్రబలకుండా చూడాలని, ఎక్కడా నీరు నిల్వ ఉండకుండా చూడా లన్నారు. కార్యక్రమంలో కనుమూరు పీహెచ్ సీ వైద్యుడు వేదాంతం వంశీకృష్ణ, నిమ్మకూరు, జమీ? ల్వేపల్లి వైద్యులు నాగజ్యోతి, ఆనందబాబు పాల్గొ న్నారు.