ఎందరో పోరాటయోధుల ప్రాణ త్యాగాలు, లాఠీదెబ్బలు, ఉరికొయ్యలు, జైలు శిక్షలు, అవిశ్రాంత ఉద్యమంతో భారత్కు 1947 ఆగస్టు 15న బ్రిటిషర్ల నుంచి స్వాతంత్య్రం వచ్చింది. ఆసేతు హిమాచలం పులకరించింది. భారతావనికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయ్యాయి. కుల, మత, ప్రాంత బేధం లేకుండా భారతీయులంతా జరుపుకునే పండుగ ఇది. వందేమాతరం, జనగణమన, సారే జహాసే అచ్ఛా పాటలతో ప్రతి భారతీయుడి గుండె ఉప్పొంగే సమయమిది. అందరికీ లోకల్ యాప్ తరుపున స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు.