స్వాతంత్ర్య వేడుకలకు ముస్తాబైన విశాఖ విమానాశ్రయం. విద్యుత్ కాంతులతో ఆకట్టుకుంటున్న విశాఖ విమానాశ్రయ ప్రాంగణం. పంద్రాగస్టు సందర్భంగా విద్యుత్ కాంతులతో విశాఖ విమానాశ్రయం నూతన శోభను సంతరించుకుంటోంది. స్వతంత్ర దినోత్సవం సందర్భంగా విమానాశ్రయం గార్డెన్లో మొక్కలకు ప్రత్యేకంగా విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఈ అలంకరణ చూపరులకు ఆకట్టుకుంటోంది. విమానాశ్రయంలో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన బిగ్ స్క్రీన్లో జాతీయ గీతాలను ప్రదర్శించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa