తాడిపత్రిలోని అశోక పిల్లర్ సమీపంలోని ఓ హోటల్లో పనిచేసే విజయ్(20) కత్తితో పొట్టపై పొడుచుకొని ఆదివారం ఆత్మహత్యాయత్నం చేశాడు. యూపీకి చెందిన విజయ్ 4 ఏళ్లుగా హోటల్లో పనిచేస్తున్నాడు. ఆదివారం కుటుంబసభ్యులతో ఫోన్లో మాట్లాడిన అనంతరం కూరగాయలు కోసే కత్తితో కడుపులో పొడుచుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. తోటి పనివారు గమనించి హోటల్ యజమానికి సమాచారమిచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa