పెద్దపప్పూరు: శ్రావణమాసం ఆదివారం సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రమైన అశ్వర్ధంలో నారాయణస్వామి వెండి కవచంలో భక్తులకు దర్శనమిచ్చారు. స్వామి దర్శనానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. పెన్నానదిలో పుణ్యస్నాణాలు ఆచరించి, తడిదుస్తులతో స్వామివారి చుట్టూ ప్రదక్షిణలు చేసి, మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఆలయ ఈఓ సుబ్రమణ్యం, ఛైర్మన్ చిక్కేపల్లి, శ్రీనివాసరెడ్డి తీర్థప్రసాదాలు, అన్నదానం చేశారు.