నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరణం నేటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. అయితే, భారత స్వాతంత్య్ర దినోత్సవ వజ్రోత్సవాల్లో భాగంగా జపాన్ రాజధాని టోక్యోలోని రెంకోజీ ఆలయంలో ఉన్నా నేతాజీ అస్థికలను ఇండియా తీసుకురావాలని నేతాజీ కుమార్తె అనితా బోస్ అన్నారు. ఆ అస్థికలకు డీఎన్ఏ పరీక్ష జరిపేందుకు జపాన్ ప్రభుత్వం అంగీకరించందని ఆమె వెల్లడించారు. దీంతో నేతాజీ మరణంపై ఉన్న సందేహాలు నివృత్తి చేయవచ్చని తెలిపారు.