రాష్ట్రంలో ప్రభుత్వ ఉపాధ్యాయులసమస్యలు పరిష్కరించండి అంటూ రాష్ట్ర పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు మిట్టా కృష్ణయ్య కడప పార్లమెంట్ సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఉపాధ్యాయులకు బదిలీల్లో లాంగ్ స్టాండింగ్ గతంలో 8 సంవత్సరాలు ఉన్నట్లే యధావిధిగా కొనసాగించాలని కోరారు. 3 సంవత్సరాలలో పదవీ విరమణ చేయబోతున్న ఉపాధ్యాయులకు రేషనలైజేషన్ మరియు బదిలీల నుండి మినహాయించాలని కోరారు.