పులివెందుల పట్టణంలోని మార్కెట్ యార్డ్ సమీపంలో ఆంజనేయస్వామికి శ్రావణమాసం మంగళవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి వారికి అభిషేకం, ప్రత్యేక పూల అలంకరణ, ఆకుపూజ, వడమాలతో అలంకరణ చేశారు. వేకువజాము నుంచే భక్తులు పెద్దసంఖ్యలో విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. అర్చక స్వాములు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు.