ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింతగా విస్తరించాలని రష్యా అధ్యక్షుడు పుతిన్, ఉత్తర కొరియా అధినేత కిమ్ కు లేఖ రాశారు. 'ఇరు దేశాల సన్నిహిత సంబంధాలు కొనసాగిద్దాం. కొరియా ద్వీపకల్పం, ఈశాన్య ఆసియా ప్రాంత భద్రత, స్థిరత్వాన్ని బలోపేతం చేయడంలో ఇవి సహాయపడతాయి’ అని పేర్కొన్నారు. కిమ్ సైతం లేఖలో స్పందించారు. శత్రు దేశాల బెదిరింపులు, రెచ్చగొట్టే చర్యలను ఉమ్మడిగా ఎదుర్కొందామని పిలుపునిచ్చారు.