కరోనా వేరియంట్ ఒమిక్రాన్ ను ఎదిరించే టీకా అందుబాటులోకి వచ్చింది. ఈ వేరియంట్ పనిపట్టేలా మోడెర్నా నవీకరించిన టీకా వినియోగానికి యూకే అనుమతులు మంజూరు చేసంది. ఫలితంగా ఒమిక్రాన్ వేరియంట్‌పై పనిచేసే టీకాకు అనుమతులిచ్చిన తొలి దేశంగా యూకే రికార్డులకెక్కింది. పెద్దల కోసం బూస్టర్ డోస్‌గా దీనిని వినియోగించేందుకు యూకే మెడిసిన్ అండ్ హెల్త్‌కేర్ ప్రొడక్ట్స్ రెగ్యులేటరీ ఏజెన్సీ (MHRA) అనుమతులు మంజూరు చేసింది.