స్కూల్ టీచర్ల హాజరులో భాగంగా ఏపీ పాఠశాల విద్యాశాఖ మరో కొత్త యాప్ విడుదల చేసింది. టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది ఈ యాప్ ద్వారా ఈ నెల 16నుంచి తప్పనిసరిగా హాజరును నమోదు చేయాలి. ఫేషియల్ అటెండెన్స్ యాప్ లో టీచర్లు తమ సొంత ఫోన్ లో స్కూల్ ప్రాంగణంలోనే ఉదయం, సాయంత్రం హాజరును నమోదుచేయాలి. దీన్ని ప్రధానోపాధ్యాయులు ఉ.10గంటలలోగా యాప్‌లో ధ్రువీకరించాలి. ఉదయం 9లోగా హాజరు నమోదు చేయకుంటే యాప్ పనిచేయదు.