భారత స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రభుత్వం పలువరు ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించింది. దీంతో ఏపీలోని వివిధ జైళ్ల నుంచి సోమవారం 162 మంది విడుదలయ్యారు. వివిధ కారాగారాల నుంచి 195 మంది ఖైదీలను విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీరిలో 175 మంది జీవితఖైదీలు, 20 మంది ఇతర శిక్షలు పడినవారు ఉన్నారు. ఈ 195 మందిలో 13 మంది మహిళలున్నారు. కొన్ని కారణాలవల్ల కొందరు సోమవారం విడుదల కాలేదు.