తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని కంపార్ట్మెంట్లు పూర్తిగా నిండిపోయాయి. వీరికి దర్శనానికి 30 గంటల సమయం పడుతోంది. సర్వదర్శనం కోసం క్యూలైన్, కంపార్ట్మెంట్ల్లో వేచి ఉన్న భక్తులకు అన్నప్రసాదం, తాగు నీరు, చంటి పిల్లల కోసం పాలను టీటీడీ పంపిణీ చేస్తోంది. ఆదివారంతో పోల్చుకుంటే కొంతవరకు భక్తుల రద్దీ తగ్గింది.