ఓ ప్రయాణికుడు చేసిన చాటింగ్‌తో విమానం ఆరు గంటలపాటు నిలిచిపోవటమే కాక గందరగోళాన్ని సృష్టించింది. మంగళూరు నుంచి ముంబై వెళ్తున్న ఇండిగో విమానంలో ఓ ప్రయాణికుడు తన గర్ల్ ఫ్రెండ్‌తో చేస్తున్న చాటింగ్‌లో 'యు ఆర్ ద బాంబర్' అన్న మెసేజ్‌ను పక్క సీట్లో ఉన్న తోటి ప్రయాణికురాలు చూసింది. వెంటనే ఆమె విమాన సిబ్బందికి చెప్పడంతో అప్రమత్తమై సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీ చేయగా, అది సరదాగా సంభాషణ అని తేలింది.