నీలకంఠాపురంలో నూతనంగా నిర్మిస్తున్న ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రి నిర్మాణానికి తను బాధ్యతగా కేజిఎఫ్ సినిమా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ రూ. 50 లక్షలు విరాళం ప్రకటించారు. సోమవారం తన స్వగ్రామమైన నీలకంఠాపురంలో జరిగిన 75వ స్వాతంత్య్ర దినోత్సవం వేడుకలకు హాజరయ్యారు. అనంతరం నీలకంఠాపురంలోని ఎల్వీ ప్రసాద్ కంటి పరీక్ష ఆస్పత్రిని సందర్శించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి డాక్టర్ రఘువీరా రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.