బుక్కరాయసముద్రం మండలం దయ్యాలకుంటపల్లి గ్రామంలో అప్పుల బాధతో ఆదినారాయణ(41) అనే చేనేత కార్మికుడు సోమవారం రాత్రి ఇంటిలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబ జీవనాధారం అయిన చేనేత మగ్గం వేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవారు. చేసిన అప్పులు తీర్చలేక అప్పుల బాధ తాళలేక గత రాత్రి ఇంటిలో ఆత్మహత్య చేసుకున్నాడు. మృతి చెందిన చేనేత కార్మికునికి నలుగురు కుమార్తెలు వున్నారు.