ఒంగోలు మండలం కరవది గ్రామంలో మంగళవారం సెబ్ పోలీసులు సోదాలు నిర్వహించారు. తమ గ్రామంలో బెల్ట్ మద్యం దుకాణాలు నడుస్తున్నాయని, విచ్చలవిడిగా గుట్కాలు అమ్ముతున్నారని సోమవారం రాత్రి గ్రామస్థులు ఎస్పీ మలిక గర్గ్ కు ఫిర్యాదు చేయగా ఆమె ఈ ఉదయాన్నే దాడులు చేయించారు. ఈ సందర్భంగా అక్రమ మద్యం, గుట్కా నిల్వలు సెబ్ అధికారులకు దొరికాయి. పలువురిని వారు అదుపులోకి తీసుకున్నారు. గ్రామస్తులు ఎస్పీకి కృతజ్ఞతలు తెలిపారు.