భారతదేశ 75వ స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా, ఆగస్టు 15న అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం తన మొదటి డ్రోన్ సేవ, 'మెడిసిన్ ఫ్రమ్ ది స్కై'ను ప్రారంభించింది. మొదటి దశగా సెప్పా నుండి చయాంగ్ తాజో వరకు ఈ సేవలను అందించనుంది. కాగా, ఈ ప్రాజెక్ట్ను వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సహకారంతో ప్రారంభించినట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి పెమా ఖండూ ట్విట్టర్లో పేర్కొన్నారు.