ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం కస్తూర్బా పాఠశాల వద్ద బొలెరో వాహనం ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టడంతో ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటనలో బొలెరో డ్రైవర్‌తో పాటు బైక్‌పై ఉన్న భార్యభర్తలు మృతి చెందారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు. మృతుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa