సామాన్యులకు మరో షాక్ తగిలింది. దేశవ్యాప్తంగా బుధవారం నుంచి పాల ధరలు పెంచుతున్నట్లు అమూల్, మదర్ డెయిరీ సంస్థలు వెల్లడించాయి. లీటరుపై 2 రూపాయలు అధికంగా పెంచుతున్నట్లు ఆ సంస్థలు పేర్కొన్నాయి. దేశ వ్యాప్తంగా ఎక్కువ మంది అమూల్, మదర్ డెయిరీ బ్రాండ్ పాలను వినియోగిస్తున్నారు. రేపటి నుంచి వీటి ధరలు పెరుగుతుండటంతో సామాన్యులకు మరింత భారం కానుంది.