జిల్లా సర్వతోముఖాభివృధికి కలిసి కట్టుగా కృషి చేద్దామని గౌరవ రాష్ట్ర పర్యాటక , సాంస్కృతిక , యువజన సంక్షేమ శాఖామాత్యులు మరియు జిల్లా ఇన్ - ఛార్జి మంత్రి వర్యులు ఆర్ . కే . రోజా గారు పిలుపునిచ్చారు . 76వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జిల్లా యంత్రంగం స్థానిక పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో సోమవారం ఎంతో ఘనంగా నిర్వహించారు . ఈ వేడుకల్లో జిల్లా ఇన్ - ఛార్జి మంత్రి ముఖ్యఅతిధిగా పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు .
తొలుత పెరేడ్ గ్రౌండ్స్ చేరుకున్న జిల్లా ఇన్ - ఛార్జి మంత్రి వర్యులు ఆర్ . కే . రోజా గారికి జిల్లా కలెక్టర్ పి . రంజిత్ బాషాగారు , జిల్లా ఎస్ . పీ . పి . జాషువా గారు , జాయింట్ కలెక్టర్ మహేష్ కుమార్ రవిరాల గార్లు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు .
ఈ సందర్భంగా స్వాతంత్ర్య సమరయోధులు పిన్నమనేని సత్యనారాయణ గారి సతీమణి పి . అనసూర్యవతి , స్వాతంత్ర్య సమరయోధుల వారసులు తోట విజయలక్ష్మీ , బి . సత్యనారాయణ గార్లను మంత్రివర్యులు ఘనంగా సత్కరించారు .
అనంతరం జిల్లా ఇన్ - ఛార్జి మంత్రి వర్యులు ఆర్ . కే . రోజా గారు , జిల్లా కలెక్టర్ పి . రంజిత్ బాషాగారు , జిల్లా ఎస్ . పీ . జాషువా గార్లకు పోలీస్ గౌరవ వందనం స్వకరించారు .వివిధ ప్రభుత్వ సంక్షేమ శాఖలు అమలు చేస్తున్న పథకాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించేందుకు శకటాలు ప్రదర్శించారు .
వివిధ శాఖల ద్వారా లబ్దిదారులకు ఉపకరణాలు మంత్రివర్యులు అధికారులతో కలిసి పంపిణీ చేశారు . జిల్లా సమాచార పౌరసంబంధాల శాఖ జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య జీవిత విశేషాలతో పాటు జాతీయ స్ఫూర్తిని నింపే ఫోటో ప్రదర్శన ఏర్పాటు చేశారు .
ఈ వేడుకల్లో వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు దేశభక్తి గేయాలకు నర్తించి ఆహుతుల్లో దేశభక్తి స్ఫూర్తిని రగిలింపజేశారు . వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉత్తమ సేవలందించిన అధికారులు మరియు సిబ్బందికి మంత్రివర్యులు , కలెక్టర్ , జాయింట్ కలెక్టర్లతో కలిసి ప్రశంసా పత్రాలు అందజేశారు .
ఈ కార్యక్రమంలో గౌరవ శాసన సభ్యులు పేర్ని వెంకటరామయ్య ( నాని ) గారు , జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఉప్పాల హారిక గారు , నగర మేయర్ మోకా వెంకటేశ్వరమ్మ గారు , పలువురు ప్రజాప్రతనిధులు , జిల్లా రెవెన్యూ అధికారి ఎం . వెంకటేశ్వర్లు గారు , వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు .
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa