తెనాలి: స్థానిక తూర్పు కాలువలో మంగళవారం గుర్తు తెలియని సుమారు 60 సంవత్సరాల ఓ వృద్ధుడి మృతదేహం నీటిలో కొట్టుకు రావడాన్ని గమనించిన స్థానిక యువకులు వెలికి తీసి, మూడో పట్టణ పోలీసులకు సమాచారమిచ్చారు. మృతదేహంపై ఎలాంటి గాయాలు లేవని, మంగళవారమే నీటిలో పడినట్లు ఉన్నారని, కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.