కార్వేటినగరం పరిధిలోని కొల్లగుంట పంచాయతీ, కొల్లగుంట పాతకాలనీ, బట్టువారిపల్లిలో బుధవారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమములో ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు అడుగడుగునా మహిళలు బ్రహ్మరథంతో హారతులు పట్టారు. జగనన్నకి అండగా ఉంటాం అంటూ ముక్త కంఠంతో లబ్ధిదారులు చెప్పడం ద్వారా జగనన్న అందిస్తున్న సంక్షేమ పథకాలు మాకు అందుతున్నాయంటూ లబ్ధిదారులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.