ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని వాసవి రియల్ ఎస్టేట్ గ్రూప్ ఆఫీసుల్లో ఆదాయపన్ను శాఖ అధికారులు బుధవారం దాడులు చేపట్టారు. ఏకకాలంలో 20 చోట్ల సోదాలు జరిపారు. వాసవి గ్రూప్ ఛైర్మన్, వాసవి గ్రూప్ డైరెక్టర్ విజయ్, ఆయన తనయుడి ఇళ్లలోనూ తనిఖీలు చేశారు. వాసవి గ్రూప్ భారీగా నిర్మాణాలు చేపడుతూ పన్నులు ఎగవేసినట్టు ఐటీ శాఖ అనుమానిస్తోంది. ఈ నేపథ్యంలోనే దాడులు నిర్వహించినట్టు సమాచారం.