బీహార్ రాష్ట్రం పాట్నాలో ఒక కూరగాయల వ్యాపారి కుమార్తెపై బుధవారం ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. ఇంద్రపురి పరిధిలోని సిపర ఏరియాలో ఈ ఘటన జరిగింది. యువతిని మెడపై కాల్చి, నిందితుడు వెంటనే అక్కడి నుంచి పరారయ్యాడు. గాయపడిన యువతి ప్రస్తుతం ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ప్రేమ వ్యవహారమే ఈ దాడికి కారణమని పాట్నా పోలీసులు భావిస్తున్నారు.