భారత పురుషుల క్రికెట్ జట్టు వచ్చే ఐదేళ్లలో 141 ద్వైపాక్షిక అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడనుంది. ఈమేరకు మే, 2203 నుంచి ఏప్రిల్ 2027 కాలానికి సంబంధించిన ఎఫ్‌టీపీని ఐసీసీ బుధవారం ప్రకటించింది. భారత్ రాబోయే ఎఫ్టీపీలో 38 టెస్ట్‌లు, 42 వన్డేలు, 61 టీ20లలో తలపడనుంది. ఎప్పటిలాగానే భారత జట్టుకు కిక్కిరిసే షెడ్యూల్ ఉన్నా.. అదే సమయంలో పాకిస్థాన్‌తో మాత్రం ద్వైపాక్షిక సిరీస్‌లు లేకపోవడం గమనార్హం.