ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరాల జాబితాలో ఢిల్లీ, కోల్‌కతాలు మొదటి 2 స్థానాల్లో ఉన్నాయి. హెల్త్ ఎఫెక్ట్స్ ఇనిస్టిట్యూట్(హెచ్ఈఐ) స్టేట్ ఆఫ్ గ్లోబల్ ఎయిర్ విడుదల చేసిన నూతన నివేదిక ప్రకారం.. సగటు వార్షిక జనాభా వెయిట్ పీఎం 2.5 ఎక్స్‌పోజర్ పరంగా ఢిల్లీ, కోల్‌కతాలను అత్యంత కాలుష్య నగరాల జాబితాలో చేర్చింది. ఈ జాబితాలో ముంబైకి 14వ స్థానంలో నిలవగా, టాప్-20లో మరే భారత నగరం లేకపోవడం కొంత ఊరటనిస్తుంది.