బీజేపీ కీలక నేత, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని ఆ పార్టీ పార్లమెంటరీ బోర్డు నుంచి, బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ నుంచి తప్పించటంపై.. శరద్ పవార్‌కు చెందిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ మండిపడింది. గడ్కరీ ఎదుగుదల ఇష్టం లేకే పార్లమెంటరీ బోర్డు నుంచి తీసేశారని విమర్శించింది. గడ్కరీ పార్టీలోని పెద్దలకు పోటీగా మారుతారనే భయంతో తన స్థాయిని తగ్గించేస్తుందని వ్యాఖ్యానించింది.