రష్యాలో జనాభా పెంచేందుకు ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక ప్రకటన చేశాడు. 10 మంది అంతకంటే ఎక్కువ మంది పిల్లలను కన్న మహిళలకు ఒక మిలియన్ రూబుల్స్(రూ.13 లక్షలు) అందిస్తానని ప్రకటించాడు. కరోనా, ఉక్రెయిన్‌తో యుద్ధం కారణంగా రష్యాలో కొంతకాలంగా జనాభా విపరీతంగా తగ్గిపోతోంది. ఈ నేపథ్యంలో 'మదర్ హీరోయిన్' పేరుతో పుతిన్ ఈ పథకాన్ని తీసుకోచ్చారు. పదో సంతానం మొదటి పుట్టిన రోజున ఈ నగదును అందిస్తారు.