డ్రాగన్ ఫ్రూట్ తోటల పెంపకానికి సంబంధించి రైతులకు ఏపీ ప్రభుత్వం నిధులు అందించనుంది. ఈ పంట ద్వారా రైతులను ప్రోత్సహించేందుకు ఉపాధి హామీ ద్వారా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. జాబ్ కార్డుతో పాటు 50 సెంట్ల భూమి ఉన్న రైతులు ఈ తోటల పెంపకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. వరుసగా మూడేళ్లపాటు రూ.3,08,722 వరకు ప్రభుత్వం నిధులు అందించనుంది. వేతనదారులకు రూ. 71,420లు, మెటీరియల్ ఖర్చుకు రూ.2,37,302లు అందజేయనుంది.