చేబ్రోలు: గుండవరం గ్రామములలో బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవిస్తున్న 8 మందిని చేబ్రోలు ఎస్సై జి. వేంకటాద్రి అదుపులోకి తీసుకొని వారిపై కేసులు నమోదు చేశారు. వారిని త్వరలో కోర్టుకు హాజరు పరుస్తామని తెలిపారు. బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించి అల్లర్లు సృష్టించిన వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ తెలిపారు. బహిరంగంగా మద్యం సేవించే వారి సమాచారం ప్రజలు పోలీసులకు తెలియజేయాలని ఆయన కోరారు.