పొన్నూరు పట్టణంలోని కసుకర్రు రోడ్డులో విజయదుర్గ బార్ ఎదురు బడ్డి కొట్టిలో ప్రభుత్వ నిషేధిత గుట్కా ప్యాకెట్లు అమ్ముతున్నారన్న సమాచారం రావడంతో అర్బన్ సీఐ శరత్ బాబు ఆదేశాల మేరకు ఎస్సై హశీమ్ సిబ్బందితో బుధవారం సోదాలు నిర్వహించారు. 245 ప్యాకెట్లు లభించాయని వాటి విలువ సుమారు 1500 రూపాయలు ఉంటుందని తెలిపారు. సదరు వ్యక్తిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై హశీమ్ తెలిపారు.