రాజుపాలెంలో నర్సరీ నిర్వహించే పగడాల సాంబశివరావు ఇంట్లో 25 రూపాయలు నగదు ఆగంతకుడు దోచుకు వెళ్లాడు. అర్ధరాత్రి ఇంట్లోకి ప్రవేశించి చోరీ చేస్తుండగా మేల్కొన్న కుటుంబ సభ్యులను దొంగ బెదిరించాడు. తలుపులు మూసి దొంగను నిర్బంధించి పోలీసులకు సాంబశివరావు ఫిర్యాదు చేయగా పోలీసులు వచ్చేలోపే కిటికీలో నుంచి దొంగ పరారయ్యాడు. బాధితుడు సాంబశివ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.