మహారాష్ట్రలోని రాయగడ జిల్లా హరిహరేశ్వర్ సముద్ర తీర ప్రాంతంలో ఆయుధాల బోట్ కలకలం రేపింది. అనుమానాస్పద బోట్ ను చూసి స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు బోట్‌ను క్షుణ్ణంగా పరిశీలించగా అందులో ఏకే 47తో సహా భారీ ఆయుధాలున్నట్లు గుర్తించారు. దీంతో పోలీసులు రాయగడలో హైఅలెర్ట్ ప్రకటించారు. రాష్ట్రంలో దహీహండీ, గణేశోత్సవాలు వస్తుండటంతో ఉగ్రవాద కుట్ర జరిగే అవకాశం ఉందని హైఅలర్ట్ ప్రకటించారు.