ఏపీ సర్కార్ మరో వెయ్యి కోట్ల రూపాయలను ఆర్బీఐ నుంచి రుణం తీసుకుంది. రూ.500 కోట్ల చొప్పున రెండు లాట్ల సెక్యూరిటీలను వేలం వేసి ఈ అప్పును తీసుకుంది. ఏపీ సర్కార్ గత 13 ఏళ్ల కాల పరిమితితో 7.72 శాతం వడ్డీకి సెక్యూరిటీలు వేలం వేయగా ఆ సెక్యూరిటీల వేలం ద్వారా జులై వరకూ రాష్ట్ర ప్రభుత్వం 21,500 కోట్ల రూపాయల రుణాన్ని తీసుకుంది. ఈ విషయాన్ని ఆర్బీఐ వెల్లడించింది.