మహారాష్ట్ర తీరంలో ఓ విదేశీ బోటు కలకలం సృష్టించింది. ఒడ్డుకు కొట్టుకొచ్చిన పడవలో ఏకే-47 తుపాకులు కనిపించడంతో తీవ్ర భయాందోళనకు గురయ్యారు. దీనిపై మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, హోంమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు. ఆ బోటు ఆస్ట్రేలియాకు చెందిన దంపతులదని తేలింది. అందులో మూడు తుపాకులు ఉన్నాయని తెలిపారు.బోటు ఇంజన్ లో లోపం వల్లే ఆస్ట్రేలియన్ దంపతులు బోటు నుంచి వెళ్లిపోయారని వివరించారు. ఇందులో ఉగ్రవాద కోణం లేదని స్పష్టం చేశారు. అయితే బోటులో ఆయుధాలు ఎందుకు తీసుకెళ్తున్నారో తెలియడం లేదని ఆస్ట్రేలియన్లు తెలిపారు. విచారణ జరుపుతున్నట్లు వెల్లడించారు.