ఏపీలో ఉన్నత విద్యాసంస్థలను ఏపీహెచ్ఈఆర్ఎంసీ హెచ్చరించింది. విద్యార్థుల నుంచి ఎక్కువ ఫీజు వసూలు చేస్తే చట్టప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించింది. ఈ మేరకు అన్ని విద్యాసంస్థలకు కమిషన్ మెంబర్ సెక్రటరీ, సీఈవో లేఖ రాశారు. యాజమాన్యాలు ఎక్కువ ఫీజు వసూలు చేయడం, సర్టిఫికెట్లు ఇవ్వడానికి డబ్బులు డిమాండ్ చేస్తే చట్టాల్లోని నిబంధనలను అనుసరించి శిక్షార్హులవుతారని హెచ్చరించారు.