ఏపీలో సూక్ష్మసేద్యం విస్తరిస్తోంది. 12 లక్షల మంది రైతులు 34.70 లక్షల ఎకరాల్లో బిందు సేద్యం, 12.98 లక్షల ఎకరాల్లో తుంపర సేద్యం చేస్తున్నారు. సూక్ష్మ సేద్యానికి మరో 28.35 లక్షల ఎకరాలు అనువైనవిగా ఉన్నాయి. దీంతో దశల వారీగా దీనిని విస్తరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 2022-23లో రూ.1,395 కోట్లతో 3.75 లక్షల ఎకరాల్లో విస్తరించి, 1.70 లక్షల మంది రైతులకు లబ్ధిచేకూర్చాలని నిర్ణయించింది.