ముంబైలోని బోరివాలి ప్రాంతంలో శుక్రవారం ఓ నాలుగంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. భవనం కొన్నేళ్ల క్రితమే శిథిలావస్థకు చేరుకుందని అధికారులు తెలిపారు. భవనం కూలిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుంది. ఎనిమిది ఫైర్ ఇంజిన్లు, రెండు రెస్క్యూ వ్యాన్లు ప్రస్తుతం అక్కడ సేవలందిస్తున్నాయి. శిథిలాల కింద ఎవరైనా చిక్కుకుపోయారేమోనని తనిఖీలు చేస్తున్నారు.