ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు కర్ణాటకలోని తుంగభద్ర డ్యామ్‌కు వరద పోటెత్తుతోంది. శుక్రవారం ఇన్ ఫ్లో 34,436 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 33,945 క్యూసెక్కులుగా ఉంది. పూర్తి సామర్థ్యం 105.788 టీఎంసీలకు గాను ప్రస్తుతం 105.788 టీఎంసీల నిల్వ ఉంది. నీటిమట్టం 1633 అడుగులకు చేరుకుందని డ్యాం ఎస్ఈ శ్రీకాంత్‌రెడ్డి, సెక్షన్ అధికారి విశ్వనాథ్ తెలిపారు.