తాడికొండ: రాజీనామాకు సిద్ధమైన మండల జడ్పిటిసి గుడిమెట్ల జ్యోతి చివరి నిమిషంలో వెనక్కి తగ్గారు. శుక్రవారం రాత్రి తాడికొండ అడ్డరోడ్డు వద్ద జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. తన రాజీనామా విషయాన్ని ఎంపీపీ భర్త శివనాగరాజు ఎమ్యెల్యే దృష్టికి తీసుకువెళ్లారని తెలిపారు. తొందరపడి రాజీనామా చేయొద్దని, ఇక నుండి జడ్పీటీసీ ప్రొటోకాల్ మిస్ కాదని ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి హామీతో రాజీనామా ఆలోచన వెనక్కి తీసుకున్నానని వివారించారు.