కేంద్ర హోం శాఖ కార్యదర్శిగా పనిచేస్తున్న అజయ్ భల్లా పదవీకాలం మరో మూడు రోజుల్లో ముగియనుండగా కేంద్రం ఆయన సర్వీసును ఏడాది పాటు పొడిగించింది. ఇటీవలే కేంద్ర కేబినెట్ సెక్రటరీ హోదాలో ఉన్న రాజీవ్ గౌబ పదవీ కాలాన్ని ఇటీవలే ఏడాది పాటు పొడిగిస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. అజయ్ భల్లా 1984 అసోం, మేఘాలయ కేడర్ కు చెందిన ఐఏఎస్ అధికారి.